మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

సూళ్లూరుపేట: పులికాట్‌ సరస్సులో పక్షులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఓను అడిషనల్‌ పీసీసీఎఫ్‌ శాంతిప్రియ ఆదేశించారు. పులికాట్‌ సరస్సును అడిషనల్‌ పీసీపీఎఫ్‌ శాంతిప్రియ శుక్రవారం సందర్శించారు. అనంతరం అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బడ్డెట్‌లో సుమారు రూ.100 కోట్లు సముద్ర ముఖద్వారాల పూడికకు కేటాయించినట్టుగా కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆమె శుక్రవారం పులికాట్‌ సరస్సు పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అటకానితిప్ప పర్యావరణ కేంద్రం పక్కనే చిన్నపాటి చెరువు ఉండడాన్ని చూసిన ఆమె ఇక్కడ పెడల్‌బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులు బాగా ఆనందించే అవకాశం ఉంది కదా.. మరి ఎందుకు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేయలేదని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు సీఎఫ్‌ సెల్వం, డీఎఫ్‌ఓ హారిక ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement