మహిళా వర్సిటీలో ‘వికాస్‌–2026’ జోనల్‌ సదస్సు | - | Sakshi
Sakshi News home page

మహిళా వర్సిటీలో ‘వికాస్‌–2026’ జోనల్‌ సదస్సు

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

మహిళా వర్సిటీలో ‘వికాస్‌–2026’ జోనల్‌ సదస్సు

మహిళా వర్సిటీలో ‘వికాస్‌–2026’ జోనల్‌ సదస్సు

తిరుపతి రూరల్‌: పద్మావతి మహిళావర్సిటీలో ‘‘వికాస్‌–2026 పరిశ్రమజ్ఞానం, అప్రెంటీస్‌షిప్‌, స్కిల్లింగ్‌ వైపు అడుగులు’’ అనే అంశంపై సౌత్‌జోన్‌ సదస్సును యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్‌ మనీష్‌జోషీ ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం, వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన వైపు యువతను నడిపించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నత విద్యాసంస్థలు పనిచేయాలన్నారు. అందులో భాగంగానే యూజీసీ 2025లో తీసుకువచ్చిన ఎంబడెడ్‌ డిగ్రీ ప్రోగ్రాంను తప్పక అమలు చేయాల్సి ఉందన్నారు. ఎంబెడెడ్‌ డిగ్రీ కోర్సుల గైడ్లైన్స్‌ను తప్పక అమలు చేసిన విద్యాసంస్థల విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. విజయభాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కొత్త ప్రణాళికలు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోందని వెల్లడించారు. మహిళా వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఉమ మాట్లాడుతూ వికాస్‌ 2026 సౌత్‌ జోన్‌ సదస్సులో ఇండస్ట్రీ అకాడమీ అనుసంధానం, స్వయంప్లస్‌ మాడ్యూల్స్‌ రూపకల్పన, కోక్రియేషన్‌ ఆఫ్‌ కరికులం తదితర ముఖ్య అంశాలపై అర్థవంతమైన చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్‌ ఆర్‌ ఉష, యూజీసీ సంయుక్త కార్యదర్శి అవిచల్‌ కపూర్‌, సదస్సు కో ఆర్డినేటర్లు విద్యావతి, శోభారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement