మహా శివరాత్రికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రికి సర్వం సిద్ధం

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

మహా శ

మహా శివరాత్రికి సర్వం సిద్ధం

శ్రీకాళహస్తి: మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తిలో సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నుంచి 14రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆదివారం నాటికి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ధూర్జటి కళాప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపటి నుంచి ప్రారంభం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు 10న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది. 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కల్యాణం, 19నన గిరిప్రదక్షిణ, 21న పల్లకీసేవ, 22న ఏకాంతసేవ, 23న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

మహా శివరాత్రికి సర్వం సిద్ధం1
1/1

మహా శివరాత్రికి సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement