ఏనుగు దంతాల‌పై స్మగ్లర్ల కన్ను | - | Sakshi
Sakshi News home page

ఏనుగు దంతాల‌పై స్మగ్లర్ల కన్ను

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 12:26 PM

ఏనుగు దంతాల‌పై స్మగ్లర్ల కన్ను

ఏనుగు దంతాల‌పై స్మగ్లర్ల కన్ను

పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్‌ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ా ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.

గతంలో కర్ణాటకలో వెలుగులోకి

కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు

సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్‌ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్‌ ఫామ్‌ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్‌ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్‌ చేసి ఇందుకు సంబంధించిన కేస్‌ రిపోర్ట్‌లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్‌ కస్టోడియన్‌ స్టోర్‌ రూమ్‌లో భద్రపరుస్తారు.

విదేశాల్లో భలే డిమాండ్‌

చైనా, జపాన్‌, సింగపూర్‌, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్‌ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement