రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

రాష్ట

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం

– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం):‘రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. రాజకీయ నాయకులకే బెదిరింపులు వస్తున్నాయి. హింస, రాజకీయ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్‌బుక్‌ పరిపాలన అమలవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విఽధించడం ఎంతో అవసరం’ అని వైఎస్సార్‌ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు బయట పెట్టినందు కు ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబుపై దాడి చేశారన్నారు. ఇది రాజ్యాంగ పాలన కాదని, రెడ్‌ బుక్‌ పాలన అని విమర్శించారు. రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతీకార రాజకీయాలు, విషపూరిత వాతావరణానికి తెరలేపుతున్నట్లు తెలిపారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 105 అర్జీలు

తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

శ్రీకాళహస్తిలో జాబ్‌మేళా రేపు

తిరుపతి అర్బన్‌: శ్రీకాళహస్తిలో బుధవారం నిర్వహించనున్న జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా పోస్ట్‌ర్‌ను కలెక్టర్‌తోపాటు జేసీ గోవిందరావు, డీఏఓ ప్రసాద్‌రావు, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా అధికారి లోకనాథం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సిడాప్‌ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాళహస్తిలోని విక్రమ్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు జాబ్‌ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హజరై..ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న యువత అర్హులని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 89198 89609, 79895 09540, 9988 853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా

తిరుమల : తిరుమలలో మంగళవారం జరగాల్సిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినా టీటీడీ ఈఓ బదిలీ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిసింది నూతన ఈఓ బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న నూతన తిరుమల ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనంతరం బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఎస్వీయూలో పీహెచ్‌డీ

అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఫిజిక్స్‌ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఐదో తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్వ్యూలకు 50 మందిగాను 47 మంది హాజరయ్యారని ఫిజిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ దేవప్రసాదరాజు తెలిపారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం1
1/3

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం2
2/3

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం3
3/3

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement