సెక్టోరియల్ పోస్టుల భర్తీకి నేడు ఇంటర్వ్యూలు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లోని సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్ పోస్టులను భర్తీ చేయడానికి బుధవారం ఇంటర్వ్యూలకు హజరుకావాలని దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆరు నెలల క్రితం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ముడుపులకేనా మీనమేషాలు అనే శీర్షికతో సాక్షిదినపత్రికలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఇంటర్వ్యూలు నిర్వహించి..పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. సెక్టోరియల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో 8 చిత్తూరు జిల్లా ఉపాధ్యాయులవి ఉండడంతో స్థానిక జిల్లా రూల్స్ నేపథ్యంలో వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించలేదు. ఈ క్రమంలో ఐదు పోస్టులకు 39 మందిని ఇంటర్వ్యూలు జరిపి, మెరిట్ ప్రకారం భర్తీ చేయనున్నారు.


