ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి

Feb 13 2026 5:30 AM | Updated on Feb 13 2026 5:30 AM

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి

చంద్రగిరి:ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని, సమష్టి వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. గురువారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాలలో నిర్వహించిన కిసాన్‌ మేళా–సమగ్ర వ్యవసాయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వ్య వసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కిసాన్‌ మేళా – సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో రైతులు విత్తనం వేయడం నుంచి కోత వరకు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), రైతు సంఘాలు ద్వారా సమష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ఎన్టీ రంగ వర్సిటీ వీసీ శార దాజయలక్ష్మి, శాస్త్రవేత్తలు సి.రమణ, గిరిజారాణి, కే. జాన్‌, విజయ శంకర్‌ బాబు, యూనివర్సిటీ హెడ్‌ ము రళీకృష్ణ, మంజుల, కదిరి మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement