గ్రామ కమిటీలతో వైఎస్సార్ సీపీ బలోపేతం
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
రైల్వేకోడూరు అర్బన్: గ్రామ కమిటీల ద్వారా వైఎస్సార్ సీపీని బలోపేతం చేయనున్నట్లు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని వెంకటేశ్వరపురంలో గ్రామ కమిటీల ఏర్పాటుకు రచ్చబండ నిర్వహించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద ప్రజలకు ఒరింగిందేమీ లేదన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, చివరకు మోసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, చదువు, ఆరోగ్యంతో ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. చంద్రబాబు ఆ పథకాలు ప్రజలకు అందకుండా ధ్వంసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమమే మన పార్టీకి అండదండలని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు జగన్ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలను ప్రేరేపిస్తూ పార్టీ శ్రేణులు, నేతల వేధింపులు, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, వెంకటరెడ్డి, యనమాల మహేష్, శంకరయ్య, బుడుగుశివయ్య, సిద్దూరాయల్ తదితరులు పాల్గొన్నారు.


