వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి

వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి

తిరుపతి అర్బన్‌: ఘన, ద్రవ వ్యవర్థాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ మౌర్యతో కలసి మున్సిపల్‌ కమిషనర్లు, పబ్లిక్‌ హెల్త్‌, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థల నుంచి నివేదికలు కోరారు. అనంతరం జిల్లాస్థాయిలో ఓ నివేదికను తయారుచేసి న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రిన్సిపల్‌ బెంచ్‌కి అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో వందశాతం వాస్తవ పరిస్థితులను పొందుపరుస్తూ నివేదికను ఇవ్వాలని ఆయన స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement