పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు | - | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

పోతిర

పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,

సభకు హాజరైన పార్టీ శ్రేణులు

చలో పోతిరెడ్డిపాడుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు, శ్రేణులు నిర్వహించారు. చంద్రబాబు నీచ రాజకీయాలతో రాయలసీమకు చేస్తున్న తీవ్ర నష్టం, రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ్‌, సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీ భరత్‌, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌, కృపాలక్ష్మి, విజయానందరెడ్డి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. – తిరుపతి మంగళం

పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు1
1/1

పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement