కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్‌!

Feb 5 2026 7:12 AM | Updated on Feb 5 2026 7:12 AM

కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్‌!

కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్‌!

● బాధితుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి వెల్లడి

తిరుపతి కల్చరల్‌: కూటమి ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత నాయుడుపేటలో ఆ పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జనాలు మితిమీరిపోతున్నాయని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దోపిడీనే లక్ష్యంగా కూటమి నేతలు గంగాధర్‌ప్రసాద్‌, చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్‌రెడ్డి, రాజేంద్ర, రఫీ అక్రమాలు, దౌర్జన్యాలు సాగిస్తూ ప్రశ్నించే వారిపై దాడులతో అ ణచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నాయుడుపేట టౌన్‌లో లాటరీ ద్వారా 14 వైన్‌షాపు లు దక్కించుకుని, ఆ షాపుల నుంచి మద్యం గ్రామీణ ప్రాంతాలకు తరలించి, పల్లెల్లో బెల్టు షాపులు నడుపుతున్నారన్నారు. అయితే ఇదే లాటరీలో బొబ్బు వెంకటరత్నం మద్యం షాపులను దక్కించుకుని ఆయన తాను భాగస్వామ్యంగా ఆ మద్యం షాపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు పాటి స్తూ నిబద్ధతతో సమయ పాలన పాటిస్తూ ఎమ్మార్పీ కే మద్యం విక్రయిస్తున్నామని తెలిపారు. దీంతో తమ మద్యం షాపును సిండికేట్‌లో కలపాలని కూటమి నేతలు తమపై ఒత్తడి తెచ్చారని, దీనిని తాము నిరాకరించామన్నారు. అప్పటి నుంచి అనేక రకాలుగా తమపై దౌర్జన్యాలు, దాడులు చేపట్టడమేకాక సుమారు 14 తప్పుడు కేసులు బనాయించి ఆందోళనలకు గురి చేశారన్నారు. సీఐ బాబి ఓ రోజు తమను బెదిరిస్తూ నెల మామూళ్లు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని, ప్రస్తుతం రూ.45 వేలు ఇవ్వాలని లేకుంటే కేసులు పెట్టి జై లుకు పంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము రూ.30 వేలు ఇస్తామని చెప్పి ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు డబ్బులు తీసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామ్మోహనరావు, సీఐ బాబిపై కేసు పెట్టి వారిని జైలుకు పంపారని తెలిపారు. దీంతో మరింత రెచ్చిపోయిన కూటమి నేతలు నిత్యం తమపై దాడులు చేస్తూ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకుని, తనకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్‌రెడ్డి, బీసీ సెల్‌ నేత బాబు, వెంకటరత్నం, జితేంద్ర, గిరిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement