రాష్ట్రంలో ప్రజా పాలన ఏదీ?
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలతో రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారే తప్ప, ప్రజా పాలన ఎక్కడ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్‌బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు, పంది కొవ్వులు కలిపారంటూ చేసిన ఆరోపణలు సీబిఐ నివేదికతో పటాపంచల్ అయ్యాయన్నారు. ఆ నిజాలను కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కట్టా గోపియాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, మల్లెమొగ్గల ఉమాపతి, రుద్రగోపి, పద్మజ, బాలాజీ, రమణారెడ్డి, ధనశేఖర్, గోలి విజయలక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


