నేడు కిసాన్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు కిసాన్‌ మేళా

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

నేడు

నేడు కిసాన్‌ మేళా

చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్‌ శారద జయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే కిసాన్‌ మేళాకు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ అనుబంధ సంఘాలు, అధికారులు రానున్నారని తెలిపారు.

జాతీయ స్థాయి పోటీలకు వైద్య కళాశాల ఉద్యోగి

తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే శశిభూషణరావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంప్లాయీస్‌ బ్యాడ్మింట్‌ టోర్నమెంట్‌లో ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఈనెల 15వ తేదీన గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌, బోధన బోధనేతర సిబ్బంది, వైధ్యాధికారులు ఆయనను అభినందించారు.

వ్యక్తి ఆత్మహత్య

బుచ్చినాయుడుకండ్రిగ: మద్యానికి బానిస అయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలవాయిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నెలవాయి గ్రామానికి చెందిన దొడ్డగ రాధయ్య (65) వ్యవసాయం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాధయ్య కొంతకాలంగా మద్యానికి బానికావడంతో కుటుంబం సభ్యులతో తరచు గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మద్యం తాగవద్దని, మందలించడంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగడంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నేడు కిసాన్‌ మేళా 
1
1/1

నేడు కిసాన్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement