బాబువి దుర్మార్గపు ఆలోచనలు | - | Sakshi
Sakshi News home page

బాబువి దుర్మార్గపు ఆలోచనలు

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

బాబువి దుర్మార్గపు ఆలోచనలు

బాబువి దుర్మార్గపు ఆలోచనలు

● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

నాయుడుపేట టౌన్‌: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దుష్ప్రాచారం చేస్తున్న చంద్రబాబు తన దుర్మార్గపు ఆలోచనలను ఇంకా విడిచి పెట్టలేదని, రాజకీయాలకు కలియుగ వేంకటేశ్వరస్వామిని వాడుకుంటూ నీచంగా వ్యవహరిస్తున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేట ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎలాంటి కొవ్వు లేదని అత్యున్నత న్యాయస్థానం క్లీన్‌చిట్‌ ఇచ్చిందన్నారు. దీంతో అసత్యప్రచారం చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, కోట్లాదిమంది భక్తులు ఛీదరించుకుంటున్నారన్నారు. చంద్రబాబు నిజాలు అంగీకరించి, వెంకన్న భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, దర్యాప్తు జరిపిన సంస్థలతోపాటు దీనిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఇళ్లను తగులబెడుతూ గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కటకం దీపిక, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్‌యాదవ్‌, పాదర్తి హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కటకం జయరామయ్య, బైనా మల్లిఖార్జునరెడ్డి, వేణుంబాక మునస్వామినాయుడు, రత్నశ్రీ, గంధవల్లి సిద్దయ్య, తేజారెడ్డి, షేక్‌ షబ్బీర్‌, మెస్‌ భాస్కర్‌రెడ్డి, ఆకుతోట సుబ్బారెడ్డి, నిడిగింటి చిట్టిబాబు, తన్నమాల రమణయ్య, కావేరిపాకం అశోక్‌కుమార్‌, కాలగంద సునీల్‌, పేట చంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement