రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్‌

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 10:50 AM

రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్‌

రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్‌

నాగలాపురం: మండలంలోని వజ్జావారి కండ్రిగ గ్రావెల్‌ క్వారీ వద్ద సోమవారం కొందరు హిజ్రాలు ఓం శక్తి మాల ధరించి మలయనూర్‌ అమ్మవారి గుడికి వెళుతున్నామని రూ.50 వేలు చందా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ఆ గ్రావెల్‌ క్వారీ యజమాని రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. హిజ్రాలు తమకు రూ.5 వేలు వద్దు..రూ.50 వేలు కావాలని మొండి పడి డిమాండ్‌ చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్వారీ వద్దకు చేరుకుని హిజ్రాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంకెప్పుడు ఇలా డబ్బులు డిమాండ్‌ చేయమని హిజ్రాలు పోలీసులను బతిమలాడడంతో పోలీసులు వారి పేర్లు, వివరాలు తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు.

Advertisement
 
Advertisement
Advertisement