రాజకీయ ప్రతీకారంతోనే చెవిరెడ్డి అక్రమ అరెస్టు
– మాజీ ఎమ్మెల్సీ యండపల్లి
చంద్రగిరి: ‘లిక్కర్ స్కామ్ అనే రాజకీయ ప్రతీకార కక్ష్య ముసుగులో ప్రజలతో సంబంధం లేని తప్పుడు కేసులు సృష్టించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ పరాకాష్ట.’ అని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన గురువారం ఆనందం వ్యక్తం చేస్తూ, ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. ప్రజాస్వామ్యంలో విపక్ష రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య కార్యకర్తల గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో, ఆధారాలు లేని కేసులు పెట్టి, వ్యక్తిత్వ హననం చేస్తూ, రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టించడమే కూటమి ప్రభుత్వ పాలనగా మారిందన్నారు.


