వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తిరుపతి అర్బన్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కడప ఆర్జేడీ శామ్యూల్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన ఆయన, డీఈఓ కేవీఎన్ కుమార్‌తో కలసి తిరుచానూరు హైస్కూలు, చెర్లోపల్లిలోని వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో హాజరు శాతం తక్కువగా ఉన్న పదోతరగతి విద్యార్థులు, అలాగే పాఠశాలల్లో జరుగుతున్న సాధారణ పరీక్షల్లో తక్కువ శాతం మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు 36 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఆయా పాఠశాలల సమీపంలోని హాస్టళ్లకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.


