ఉచితం ముసుగులో ఇసుక దోపిడీకి సిద్ధం
నాగలాపురం: మండలంలోని అరుణానదిలో ఇసుక దోపిడీకి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో అనధికారిక దోపిడీకి స్థానిక టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ దిశగా బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద మంగళవారం దాదా పు 30 ట్రాక్టర్లకు పైగా వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకోగా హిటాచ్చి యంత్రాలతో లోడింగ్ చేసుకుని అక్రమంగా బయటకు తరలించేందుకు సిద్ధమయ్యా రు. దీంతో మలిమేలకండ్రిగ వాసులు ట్రాక్టర్లను అడ్డగించారు. గ్రామస్తులతో ట్రాక్టర్లు డ్రైవర్లుకు వాగ్వాదానికి దిగారు. గొడవ జరగడంతో ట్రాక్టర్ యాజమానులు ఇసుకను నదిలోనే వదలి వెళ్లి పోయారు. అయితే ఈ విషయమై గ్రామస్తుల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


