జగనన్నను సీఎం చేద్దాం
కలసికట్టుగా పోరాడదాం..
వెంకటగిరి(సైదాపురం): కలసి కట్టుగా పోరాడాం.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి టాస్క్‌పోర్స్ సభ్యులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి , నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలతతో కలసి వెంకటగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న చంద్రబాబు పాలనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. రెండేళ్లు పూర్తికాకముందే టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు గ్రామ కమిటీలు బలోపేతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు.
ఎగిరిపడేవారికి తగిన బుద్ధి చెబుదాం
అఽధికారం అండదండలున్నాయని ఎగిరెగిరి పడే వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పడం తథ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్ధానాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 10వేల మందితో జగనన్న సైన్యంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యకర్తలకు సముచితమైన స్థానం
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు జగనన్న 2.0 సముచిత స్థానం దక్కుతుందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీకీ పూర్వ వైభవం తేవడానికి సమష్టిగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వెంకటగిరిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, జగనన్నకు బహుమతిగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్, ఆత్మకూరు పరిశీలకులు కోటేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరమణారెడ్డి, నేతలు చిట్టేటి హరికృష్ణ, రామతులసమ్మ, అనిల్‌కుమార్‌రెడ్డి, పార్టీ కన్వీనర్లు పులి ప్రసాద్‌రెడ్డి, కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మన్నారపు రవికుమార్ యాదవ్, మధుసూదన్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగనన్నను సీఎం చేద్దాం
జగనన్నను సీఎం చేద్దాం


