న్యూస్‌రీల్
గూడు.. గోడు
పంటకాలువ పేరుతో జగనన్న కాలనీలో ఇళ్ల ప్లాట్లలో లబ్ధిదారులకు ముందస్తు సమాచారం లేకుండా కాలువ తవ్వారు.
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
తిరుపతి అర్బన్: జిల్లాలో రైతుల సంఖ్య పెద్ద స్థాయిలో పెరిగినప్పటికీ..అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల సంఖ్య మాత్రమే తగ్గిపోవడంతో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులకు అర్హత ఉన్నప్పటికీ చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి, అన్నదాత సుఖీభవ పథకాన్ని దూరం చేయడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పాత లెక్కలే చూపుతున్నారు. కొత్త రైతులకు పెండింగ్‌లో ఉన్న రైతులకు సుఖీభవ అందించడంలో సర్కార్ విఫలమైందనే విమర్శలు తప్పడం లేదు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పథకాన్ని వర్తింప చేయలేదు. రెండో ఏడాదిలో తొలి విడతలో 1,54,908 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మరో 57,098 మంది రైతులు ఈకేవైసీ, బయోమెట్రిక్ పెండింగ్ ఉండడంతో ఎంపిక చేయలేదని వ్యవసాయశాఖ అధికారులు సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ 57,098 మందిని రెండో విడతలో ఎంపిక చేయాలని సూచించారు. అయినా వారికి రెండో విడతలో ఛాన్స్ రాలేదు. తాజాగా ఇచ్చిన 3వ విడతలోనూ అవకాశం దక్కలేదు. పాత లెక్కలో ఉన్న రైతులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి రెండు విడతల్లో 1,54,908 మందికి ఇచ్చారు. 3వ విడతలోనూ అదే సంఖ్యను ఎంపిక చేశారు. అయితే ఇటీవల జిల్లాల పునర్విభజన నేపథ్యంలో గూడురు నియోజకవర్గం నుంచి చిల్లకూరు, గూడూరు, కోట మండలాలు నెల్లూరు జిల్లాకు వెళ్లాయి. అలాగే అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో చేరింది. ఈ క్రమంతో గతంలో 34 మండలాలు ఉంటే ప్రస్తుతం 36 మండలాలు అయ్యాయి. దీంతో 3వ విడత సంఖ్య 1,66,006 మందికి చేరింది.
రెండేళ్ల క్రితమే 1,80,654 మందికి పథకం
రెండేళ్ల క్రితమే తిరుపతి జిల్లాలో 1,80,654 మందికి రైతు భరోసా ఇచ్చారు. ప్రతి నెలా అన్నదమ్ములు కొత్త కాపురాలు పెట్టుకుంటూ విడిపోతున్న క్రమంలో భూములు సైతం విభజన జరిగి కొత్త పాస్ పుస్తకాలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి వారు జిల్లాలో రెండేళ్ల వ్యవథిలో 30 వేల మందికి పైగా ఉన్నారు. మరోవైపు కౌలు రైతులు జిల్లాలో 22 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ఇంకో వైపు ఈకేవైసీ, బయోమెట్రిక్ పేరుతో పెండింగ్‌లో ఉన్నవారు జిల్లాలో 57,098 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో వంద శాతం న్యాయం చేస్తే..మరో లక్ష మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని జిల్లాలో జోరుగా చర్చసాగుతుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పాత లెక్కల ప్రకారం 24,622 మందిని ఎంపిక చేశారు. కొత్త రైతులకు అవకాశం కల్పించలేదు.
పాత లెక్కలే పరిగణ నలోకి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 1,80654 మంది
అర్హులు
కూటమి ప్రభుత్వంలో 1,54,908 మంది
అర్హులు
నిఘా సంస్థల పాత్ర కీలకం
చరిత్రలో నిలిచిపోయేలా
తిరుపతి నగర అభివృద్ధి
కష్టాల సేద్యం నుంచి కర్షకులను
గట్టెక్కిస్తామని..ఆపదలో ఉన్న అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎన్నికల్లో
చంద్రబాబు అండ్‌కో హామీల వర్షం
కురిపించింది. గద్దెనెక్కింది. ఇకేంముంది.. హామీలు కొండెక్కించింది. పుడమి పుత్రులను అన్ని విధాలా వంచించింది.. అన్నదాత
సుఖీభవ అంటూ మొదటి ఏడాది మోసం చేసింది.. రెండో ఏడాది కొందరిని
ఏమార్చింది.. మూడో ఏడాది కూడా మళ్లీ కోతలు పెట్టింది..పాతలెక్కలే పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను కుదించింది. ఫలితంగా అర్హులైన హలధారులు అన్నదాత
సుఖీభవకు దూరమయ్యారు.
నిరాశ మిగిల్చిన సుఖీభవ
అన్నదాతల్లో సుఖీభవ పథకం నిరాశ మిగిల్చింది.ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న రూ.6 వేలతో కలిపి, రాష్ట్రం 14వేలు ఇస్తే మొత్తం రూ.20 వేలు అంటూ మాట మార్చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయలేదు. రెండో ఏడాది ఈకేవైసీ, బయోమెట్రిక్ సాకుతో కొందరికి ఇవ్వలేదు. అలాగే భూముల విభజన నేపథ్యంలో కొత్త రైతులకు ఇవ్వలేదు. ఇంకోవైపు కౌలు రైతులకు ఎగనామం పెట్టడంతో అన్నదాతలు సుభీభవపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గం 2023–24 2025–26 తగ్గిన
అర్హులు అర్హులు రైతుల
సంఖ్య
సత్యవేడు 33,944 29,653 4,291
శ్రీకాళహస్తి 31,838 27,847 3,991
చంద్రగిరి 30,347 26,062 4,285
గూడూరు 25,965 22,217 3,748
సూళ్లూరుపేట 32,685 26,563 6,122
వెంకటగిరి 16,767 14,975 1792
(3 మండలాలు
మాత్రమే)
నగరి 9,105 7591 1514
(2 మండలాలు
మాత్రమే)
నాకు సుఖీభవ ఇవ్వండి సార్
మాది వాకాడు మండలంలోని కల్లూరు పల్లిపాళెం గ్రామం, పేద కుటుంబానికి చెందిన వాళ్లం. 3.5 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయశాఖ ఉద్యోగులకు నా బాధను చెప్పుకున్నాను. అయినా నాకు మూడో విడతలోనూ అన్నదాత సుఖీభవ అందలేదు. పాత లెక్కల ప్రకారమే ఇచ్చారంటూ చెబుతున్నారు. కొత్త రైతులకు ఎప్పుడు ఇస్తారు సార్.. పెట్టుబడి సాయం మాకు ఇప్పించాలని కోరుతున్నాం.
–పాకం చెంగయ్య, రైతు, కల్లూరుపల్లిపాళెం
అందరికీ న్యాయం చేయండి
రైతుల పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎప్పు డు ఏం జరుగుతుందో తెలియదు. దీంతోనే గత ప్రభుత్వం రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ రైతు భరోసా ప థకాన్ని పెట్టారు. ఆ తర్వాత కూటమి ప్ర భుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకాన్ని పెట్టారు. అ యితే మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయలేదు. రెండో ఏడాది కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం మూడో ఏడాది అ యినా అర్హులైన ప్రతి రైతును అన్నదాత సుఖీభవ పథకానికి ఎంపిక చేయాలని కోరుతున్నాం. –నరేంద్రయాదవ్, రైతు, శ్రీకాళహస్తి
కౌలు రైతులకు న్యాయం చేయండి
పేద కుటుంబానికి చెందిన వాళ్లం. మాకు భూములు లేవు. దాంతో పెద్ద భూస్వాముల నుంచి భూములు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా చేస్తున్నాం. అయితే మాకు ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ పథకం వర్తించడం లేదు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని రెండేళ్లుగా చూస్తున్నాం. ఓ వైపు కౌలు చెల్లించి మరోవైపు పెట్టుబడికి అప్పులు చేస్తే.. మాకు కూలీ డబ్బులు కూడా మిగిలేలా లేదు. మమ్మల్ని గుర్తించండి సార్.
– చేను వెంకటయ్య, కౌలు రైతు, వాకాడు


