● తెప్పోత్సాహం
శ్రీగోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజుసీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. – తిరుపతి కల్చరల్
రేపటి నుంచి స్పోర్ట్స్ మీట్
తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ వేదికగా బుధవారం నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం వరకు కొనసాగనున్న స్పోర్ట్స్ మీట్ రాష్ట్రంలోని పలు కళాశాలల నుంచి సుమారు 1,500మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సౌకర్యాలకు కల్పించనున్నట్లు వివరించారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఎన్నిక
తిరుపతి సిటీ : ఎస్వీయూలో రెండు రోజులుగా నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, సహాయ కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ కొత్త కమిటీని ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పవిత్ర, అక్బర్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, వినోద్, తేజ, రవీంద్ర, అనిత, మరో 21మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
● తెప్పోత్సాహం
● తెప్పోత్సాహం
● తెప్పోత్సాహం
● తెప్పోత్సాహం


