సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికే చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నదని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి సేవ చేయాలనే తపనతో జగన్ అడుగులు వేశారని, అయితే తిరుమల లడ్డూలో వాడే నెయ్యి మీద మీద వారు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమన పేర్కొన్నారు. తమ మీద ఆరోపణలు చేయడం తప్ప ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ రాక్షసుల కంటే నీచమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలోని హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సిట్ తన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేసింది. అధికారులు, డెయిరీ నిర్వాహకులు కుమ్మక్కు అయి కల్తీ చేశారు అని నివేదిక పేర్కొన్నదన్నారు. 2019-24 వరకు సిబిఐ విచారణ చేయాలని సుప్రీం కోర్టు కు వెళ్లింది మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అని భూమన పేర్కొన్నారు.
చంద్రబాబు సిట్ నివేదిక ఇచ్చి ఉంటే152 దేశ ద్రోహం కింద కేసు పెట్టారు. సుబ్బారెడ్డి సుప్రీం కోర్టు లో వాస్తవాలు వెలికి తీసేందుకే వెళ్ళారు. మీకు ధైర్యం ఉంటే 2014 -19 సీబీఐ విచారణ కోరే దమ్ము ఉందా అని భూమన ప్రశ్నించారు. 2013 నుంచి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ నే టిటిడి కు నెయ్యి సరఫరా చేసింది.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. 2021 లో కేంద్రం ఆదేశాలు మేరకే టెండర్ నిబంధనలు మార్పులు చేశాం. స్టార్ అప్ కంపెనీలు ప్రోత్సహించాలని కేంద్రం కోరిందన్నారు.
సీబీఐ నివేదికలో చాలా స్పష్టంగా తేలిపోయిందని, అధికారులు, డైరీ యజమానులు లాలూచీ పడటం వల్ల జరిగింది అని సీబీఐ తేల్చిందని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చేప కొవ్వు, పంది కొవ్వు ఎక్కడ వాడలేదు అని సీబీఐ తెలిపిందన్నారు. ఒక ఆవుకూడా లేని సంస్థ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోంది. ఎడీడీబీ చైర్మన్ ను పిలిపించి 50 కోట్ల నిధులతో , గిర్,సాహివాల్ ఆవులు ద్వారా పెయ్యా దూడలు పెంచే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఎన్డిడిబి ద్వారా బీటా స్టెరాలసిస్ టెస్టు లకు అత్యాధునిక మెషీన్లు మా హయాం లో కొనుగోలు చేశాం. నెయ్యి ప్రామాణికత మెరుగు పర్చడానికి 5.కోట్ల50 లక్షలు నూతన యంత్రాలు మేము కొనుగోలు చేశాం. విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర 2013 నుంచి సాంకేతిక నిపుణులు గా ఉన్నారు..వీళ్లు దోషులు అని సీబీఐ తేల్చిందని భూమన తెలిపారు.
యజ్ఞం చేస్తున్నది జగన్ మోహన్ రెడ్డి, రక్తం పోస్తున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్ బోరా అనే బోర్డు సభ్యుడు నెయ్యి సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తమ స్వార్థం కోసం 140 కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. నాలుడుట్యాంకర్ లు తిరస్కరించినవి మళ్ళీ కొండకు వస్తె, తిరిగి మళ్ళీ కల్తీ నెయ్యి ను లడ్డూ తయారీకి వాడారు..దీనికి సమాధానం చెప్పాలని భూమన నిలదీశారు. మా పాలనలో 18 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. మీ హయంలో 14 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. 2024 సెప్టెంబర్ 24 మళ్ళీ అదే నెయ్యి కల్తీ అయ్యిందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఏడాదిన్నర గా నెయ్యి కల్తీ చేశారని, మతం రెచ్చగొట్టి, హిందువులు రెచ్చ గొట్టారు. పదవి పొందడం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారారు. పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకురోడ్లు కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకోవాలని భూమన డిమాండ్ చేశారు.


