జనసేన నాయకుల ఇసుక దోపిడీ
కలువాయి(సైదాపురం): రాజుపాళెంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి వెంకటరెడ్డి, ఇతర జనసేన నాయకులు అక్రమంగా ఇసుకను తరలించేశారు. సిమెంట్ రోడ్లు నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా పెన్నా నదికి తూట్లు పొడుస్తున్నారు. పగలు అయితే గ్రామస్తులు అడ్డగిస్తారని అర్ధరాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. తరలించిన ఇసుకను డంపింగ్ చేసి పెట్టుకున్నారు. తెలుగు రాయపురంలో టీడీపీ నేతలు, రాజుపాళెంలో జనసేన ఇలా పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుకను తరలించేందుకు వాటాలు పంచుకుంటున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
జనసేన నాయకుల ఇసుక దోపిడీ


