విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
తిరుపతి రూరల్: అవిలాల గ్రామ పంచాయతీ సుబ్బయ్య కాలనీలో కాంక్రీట్ పనులు చేస్తున్న యువకుడు విద్యుత్‌షాక్ గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుబ్బయ్య కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం కాంక్రీట్ పనులు చేస్తున్న మహేష్ (25) అనే యువకుడుకి విద్యుత్తు షాక్ గురయ్యాడు. దీంతో తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహేష్ అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు తిరుచానూరు యోగిమల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తోటి కార్మికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


