ప్రమాద రహిత జిల్లాగా తిరుపతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్:రోడ్డు ప్రమాద రహి త జిల్లాగా తిరుపతి ఉండాలనే లక్ష్యంతో డ్రైవర్లు పనిచేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి జ గదీష్ సూచించారు. డ్రైవర్స్ డే సందర్భంగా శని వారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రోజాలను అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ సురక్షితంగా వాహనాలు నడుపుతున్నారంటూ డ్రై వర్లను కృతజ్ఞతలు తెలిపారు. చెడు అలవాట్లను దూరం చేసి ఆరోగ్యంగా ఉండాలని ఉత్తమ డ్రైవర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథ్, తిరుపతి డిపో మేనేజర్ సురేంద్ర కుమార్, సెంట్రల్ బస్టాండ్ ఏటీఎం, బస్టాండ్ అసిస్టెంట్ మేనేజర్, బస్టాండ్ కంట్రోలర్లు డ్రైవర్లు పాల్గొన్నారు.
పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు
–బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
తిరుపతి కల్చరల్: కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన పోలీసులే కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యానికి ఒడిగట్టారని బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో తిరుపతి అర్బన్ మండలం మంగళం సర్వే నంబర్ 109/2 లో 88 అంకణాల స్థలాన్ని తన భార్య అంజనా దేవి పేరుతో కొనుగోలు చేశానన్నారు. అయితే ఈ నెల 7వ తేదీన ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రామకృష్ణ ఈ స్థలం తనదంటూ దౌ ర్జన్యానికి దిగుతూ ఆ స్థలంలో ప్రహరీ గోడ నిర్మా ణం తలపెట్టారని తెలిపారు. ప్రజలకు అన్యా యం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. తన స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని అలిపిరి డీఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.


