ఆలకించండి.. ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. ఆదుకోండి

Jan 24 2026 8:56 AM | Updated on Jan 24 2026 8:56 AM

ఆలకిం

ఆలకించండి.. ఆదుకోండి

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

ఏడాదిగా అమలు కాని ఉచిత విద్యుత్‌ జీఓ

చేనేత బతుకుల్లో చీకట్లు

గడ్డు పరిస్థితిలో చేనేత రంగం

అమలుకు మీన మేషాలు లెక్కిస్తున్న బాబు సర్కారు

ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు.
సైబర్‌ నేరగాడి అరెస్టు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైబర్‌ నేరగాడిని రేణిగుంట జీఆర్పీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
చేనేతల డిమాండ్లు ఇవీ

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్‌ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్‌ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్‌ ఆర్డర్‌. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్‌ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.

మగ్గం నేస్తున్న దృశ్యం

వెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్‌ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్‌ లూమ్స్‌కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్‌ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్‌ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.

ఉచిత విద్యుత్‌ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్‌లూమ్స్‌ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్‌ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్‌ జీఓ నంబర్‌ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు.

ఒత్తిడి తెచ్చినా...

అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్‌ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్‌ లూమ్‌ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్‌లూమ్‌ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్‌ సంస్థలు బడ్జెట్‌ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్‌ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్‌లో నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమాధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.

గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం

ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షకు 381మంది గైర్హాజరు

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షకు 381మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్‌ సబ్జెక్టులతో పాటు పక్కా ఉత్తీర్ణత సాధించాల్సిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 30,373 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 29,992 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

తిరుపతి తుడా: మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని పట్టణ, మున్సిపల్‌ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మెప్మా సంచాలకులు ఇప్రీమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా సంస్థ సహకారంతో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమో, డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు కర్ణాటక రాష్ట్రం తుమకూర్‌లోని హాస్పిటల్‌ స్కిల్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాఽధి, ఉద్యోగవకాశాలను కల్పిస్తారని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో భోజన వసతితోపాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ట్రైనర్‌ మధుసూదన్‌రావు 8309154991 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు స మర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తుల కు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది.

జీఓ నంబర్‌ 44ను వెంటనే అమలు చేయాలి.

మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ నుంచి 10 శాతం రూ.8 వేల కోట్లు కేటాయించాలి.

నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి.

నూలు, సిల్క్‌కు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి.

చేనేత కుటంబాలకు రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలుఇవ్వాలి.

గృహం, వర్క్‌షెడ్‌ పతకాన్ని అమలు చేయాలి.

జీవిత బీమా సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన కొనసాగించాలి.

సహకార సంఘాలను బలోపేతం చేయాలి.

ప్రత్యేకపోరాటానికి సిద్ధం

ఉచిత విద్యుత్‌పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మికుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు. – కూన మల్లిఖార్జునరావు

నేతన్న నేస్తం అమలు చేయాలి

గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్‌తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి.

–రవి, నేత కార్మికుడు, వెంకటగిరి

ఉచిత విద్యుత్‌ అమలు చేయాలి

ఉచిత విద్యుత్‌ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్‌ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్‌ జీఓను వెంటనే అమలు చేయండి.

– బాలాజీ, నేత కార్మికుడు, వెంకటగిరి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్‌చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్‌ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్‌లూమ్స్‌ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్‌ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరుస్తున్నారు.

ఆలకించండి.. ఆదుకోండి
1
1/4

ఆలకించండి.. ఆదుకోండి

ఆలకించండి.. ఆదుకోండి
2
2/4

ఆలకించండి.. ఆదుకోండి

ఆలకించండి.. ఆదుకోండి
3
3/4

ఆలకించండి.. ఆదుకోండి

ఆలకించండి.. ఆదుకోండి
4
4/4

ఆలకించండి.. ఆదుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement