వీళ్లా పాలించేది
మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే మహిళలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అలాంటిది ఎమ్మెల్యేలే ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. సీ్త్రల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లా మనల్ని పాలించేది. ఆడవారిపై ఎవరైనా చేయివేస్తే నరుకుతానని ప్రకటించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆచరించి చూపాలి. బాధితురాలికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి.
– నదియా, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి, తిరుపతి
సిగ్గుచేటు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కూటమి ఎమ్మెల్యేలు కొందరు కీచకులుగా మారిపోయారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. బెదిరింపులతో లొంగదీసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. దీనిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తోపాటు హోంమంత్రి అనిత కూడా స్పందించాలి. కీచక ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలి. – చంద్రకళ, ప్రజాతంత్ర మహిళా సంఘం
మండల కార్యదర్శి, నాయుడుపేట
వీళ్లా పాలించేది


