అన్ని అర్హతలు ఉన్నాయి
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖ జోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజనే అని భావిస్తున్నా. అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయని రైల్వే నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నాఉ. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా ఆడుగులు వేయాలని కోరుతున్నా. – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట
గట్టిగా వాణి వినిపిస్తా
మరుగున పడిన తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెలుగులోకి తెచ్చా. పలుమార్లు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లా. రైల్వే డివిజన్ ఏర్పాటుకు సాధన సమితి ఉద్యమ నాయకులు సహకారం కోరారు. వారి వినతులను స్వీకరించా. బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా వాణి వినిపించి రైల్వేడివిజన్ సాధనకు కృషి చేస్తా. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
పూర్వ వైభవం
బాలాజీ డివిజన్ ఏర్పాటుకు తిరుపతి చాలా అనుకూలం. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. గతంలో కూడా అధికారులు పరిశీలనలు కూడా చేశారు. తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అమలు చేయాలని పెద్దల సభలో చర్చించా. కొత్త డివిజన్ ఏర్పాటుతో ఐదు జిల్లాలకు పూర్వవైభవం వస్తుంది.
– మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు
అన్ని అర్హతలు ఉన్నాయి
అన్ని అర్హతలు ఉన్నాయి


