స్పోర్ట్స్ మీట్‌కు సర్వ సిద్ధం
తిరుపతి సిటీ : ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్’అండ్ గేమ్స్ మీట్‌కు సర్వ సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు తిరుపతికి చేరుకున్నట్లు వెల్లడించారు. వారి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
ప్రశాంతంగా ఒకేషనల్ ప్రాక్టికల్స్
తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 కేంద్రాల్లో చేపట్టిన ఫస్ట్‌ఇయర్ ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్స్‌కు 406మంది విద్యార్థులకు గాను, 361మంది హాజరైనట్లు వెల్లడించారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 350 మందికి గాను 326మంది హాజరైనట్లు వివరించారు.
స్విమ్స్‌లో
‘డయాబెటిక్ ఫుట్ క్లినిక్’
తిరుపతి తుడా : స్విమ్స్‌లో డయాబెటిక్ ఫుట్ క్లినిక్‌ను మంగళవారం ప్రారంభించారు. స్విమ్స్ పద్మావతి ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ మాట్లాడుతూ డయాబెటిక్ కారణంగా పాదాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు సమగ్ర చికిత్స అందిస్తామన్నారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ హరిప్రసాద్ ఈ క్లినిక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని వెల్లడించారు. ఆయన పొడియట్రిక్, డయబెటిక్ ఫుట్ సమస్యల నివారణపై ప్రత్యేక శిక్షణ పొందారని వివరంచారు. ఫుట్ పరిశీలన, ప్రమాద స్థాయి అంచనా, న్యూరోపతి, ఇస్కీమియా ఇన్ఫెక్షన్ గుర్తింపు, గాయం సంరక్షణ, శస్త్ర చికిత్స వంటి సేవలందించనున్నట్లు వివరించారు. డాక్టర్ అలోక్ సచిన్, డాక్టర్ ముక్తేశ్వరయ్య, డాక్టర్ ఉషా కళావత్, డాక్టర్ కోటి రెడ్డి పాల్గొన్నారు.
స్పోర్ట్స్ మీట్‌కు సర్వ సిద్ధం


