శ్రీరంగ నీతులు ఆపండి
మహిళలకు అన్యాయం జరిగితే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పదే పదే చెప్పేవారు. చివరుకు తాను తప్పు చేసినా ఉరి తీయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే చెప్పారు. అప్పుడు మహిళల రక్షణ పై ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న శ్రీరంగనీతులు చెప్పడం అపి రైల్వేకోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి.
– కుమారి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, మహిళ సమాఖ్య
ఏదీ చిత్తశుద్ధి
రైల్వే కోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహిళలు ఎవరైనా ఒక్కటే. అందులో ప్రభుత్వ ఉద్యోగిని వేధించి భయాందోళనకు గురిచేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యం పై ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వచ్చింది. ఎంత వేధించి ఉంటే ఆ మహిళ అంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది. ఇప్పటికై న చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– చిట్టెమ్మ, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, ఐద్వా
శ్రీరంగ నీతులు ఆపండి


