పూటకు 550 బిర్యానీలు అమ్ముతాం
తిరుపతిలో 2020 నుంచి బిర్యానీలకు ప్రత్యేక క్రేజ్ పెరిగింది. చిన్న పిల్లలు, యువత ఇంట్లో వండిన వంటకాలపై శ్రద్ధ చూపడం లేదు. బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటూ తల్లిదండ్రులను మారం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. కరోనా సమయంలో చికెన్, మటన్ ప్రతి ఇంట్లో విపరీతంగా వినియోగించారు. దీంతో ఆ అలవాటుతో ప్రస్తుతం బిర్యానీల క్రేజ్ పెరిగింది. నగరంలో మాది చిన్న బిర్యానీ హోటల్ మాత్రమే. ఆన్‌లైన్‌లో ఒక పూటకు 200 బిర్యానీల వరకు పంపుతాం. ప్రజలు నేరుగా మరో 250 బిర్యానీల వరకు కొనుగోలు చేశారు. పండగలు, పార్టీల వంటి ప్రత్యేక రోజుల్లో రోజుకు 2 వేల వరకు సేల్ అవుతాయి.–మస్తాన్, హోటల్ యజమాని, తిరుపతి
అతిగా తింటే ప్రమాదమే!
ఫైబర్, మినరల్స్ తక్కుగా ఉండి, అఽధిక క్యాలరీలు, నూనె, వనస్పతి, ఫ్యాటీ మీట్స్ ఉండడంతో బిర్యానీ అధికంగా తినేవారికి ఊబకాయం తప్పదు. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్, ప్యాటీ లివర్, షుగర్, బీపీ, జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల భారినపడుతున్నా రు. అధికంగా తింటున్న యువత చిన్న వయస్సులోనే గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. బిర్యానితో పాటు శీతలపానీయాలతో మరిన్ని ఆరో గ్య సమస్యలకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు హోటల్ బిర్యానీలకు దూరంగా ఉండాలి.
–డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్య నిపుణులు, తిరుపతి
పూటకు 550 బిర్యానీలు అమ్ముతాం


