ఆర్టీసీ కార్గో ఏజెన్సీకి అవకాశం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: చంద్రగిరి, పాకాల, రంగంపేట, పాపనాయుడుపేట, ఏర్పేడు, తడ, శ్రీసిటీ, నాగలాపురం, మేనకూర్ సెజ్ ప్రాంతాల్లో ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ఏపీబీ(ఆథరైజ్డ్ పార్సెల్ బుకింగ్) ఏజెన్సీ నిర్వహణకు అవకాశం ఉందని కమర్షియల్ ఏటీఎం తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ తీసుకొని కార్గో వ్యాపారం చేయడానికి ఆసక్తి గలవారు డిపాజిట్ చెల్లించాలన్నారు. అందుకుగాను బుకింగ్ నెట్ అమౌంట్‌కి 15 పర్సెంట్ రిసీవింగ్‌కి 2 పర్సెంట్ కమీషన్ లభిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు ఏటీఎం కమర్షియల్ తిరుపతి 73311 47268 లేదా పురుషోత్తం 95538 55667 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
సత్వర సేవలే లక్ష్యం
తిరుపతి కల్చరల్: డిజిటల్ పద్ధతిలో అత్యాధునిక సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ఎంఎన్‌వీ కేర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎంఎన్‌వీ సొల్యూషన్స్ ఎండీ ఎంఎన్.వెంకటేష్ తెలిపారు. అశోక్‌నగర్‌లోని తమ కార్యాలయంలో ఎంఎన్‌వీ కేర్ యాప్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం వెంకోబారావు బుధవారం ఆవిష్కరించారు. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.


