తప్పులు లేని పాస్ పుస్తకాలు అందించండి
తిరుపతి అర్బన్: సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పీజీఆర్‌ఎస్ అర్జీలకు పరిష్కారం చూపాలని చెప్పారు. ఈకేవైసీ, మ్యుటేషన్, డిజిటల్ సైన్ తది తర సమస్యలకు పరిష్కారం చూపాలని వెల్లడించారు. ఆ మేరకు ఆర్డీవోలు పర్యవేక్షించాలని వివరించారు. అనంతరం రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై అధికారులతో సమావేశం అయ్యా రు. ఏ పనులు ఏయే దశల్లో ఉన్నాయో తెలుసుకు న్నారు. పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించా రు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నేషనల్ హైవే పీడీలు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
సూపర్ మార్కెట్‌లో చోరీ
తిరుపతి క్రైమ్: నగరంలో ఐఎస్ మహల్ సమీపంలోని ఎస్‌మార్ట్ సూపర్ మార్కెట్‌లో చోరీ జరిగిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌మార్ట్ సూపర్ మార్కెట్‌ల్లోకి సోమవారం అర్ధరాత్రి తర్వాత షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. 15 నిమిషాల్లోనే షాపులో ఉన్న లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్లుగా గుర్తించారు. ముగ్గురు దుండగులు ముసుగు వేసుకొని ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిపై షాపు యజమాని జాబీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


