ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టెకెట్ల విడుదల
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను శనివారం విడుదల చేసినట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల లాగిన్‌లో కానీ నేరుగా httpr://bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి కానీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం తమ ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్ నంబర్‌ను లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు.
ఇసుక అక్రమ తవ్వకాలు
రేణిగుంట: మండలంలోని పిళ్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రోటోకాల్, బందో బస్తు విధుల్లో బిజీగా ఉన్న సమయాన్ని అదునుగా చూసుకుని ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. శనివారం ఉదయం జేసీబీలతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో స్థానికులు ఎవరూ అడ్డుకునే సాహసం చేయడం లేదు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి హవా
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రాంతీయ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేణిగుంట మండలంలోని స్థానిక వ్యక్తి జేసీబీ ఇసుక తవ్వి, ట్రాక్టర్లతో తరలిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లోని కొందరు సిబ్బంది సహకరిస్తుండంతో రోజూ రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే
పూర్తి చేయాలి
కడప సెవెన్ రోడ్స్ : రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్‌లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటిపారుదలకు 15 శాతం నిధులు కేటాయించాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరిస్తే నే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సామాజిక న్యాయం ఒనగూరుతుందని అభిప్రాయపడ్డా రు. విభజన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన శనివారం కడపలోని బీసీ భవన్‌లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఈఎస్‌ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య హాజరయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే సంపద సృష్టి జరుగుతుందా? అని ప్రశ్నించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మహా నగరాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చుచేస్తున్నారు తప్ప ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టెకెట్ల విడుదల


