● ఉప్పొంగే శక్తి.. దేశభక్తి
పరాయి పాలన నుంచి దేశం విముక్తి పొంది..సర్వసత్తాక ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ ఊపిరిపోసుకున్న మహోన్నత రోజు ఇది. ప్రతి ఒక్కరి హృది దేశభక్తితో సంపూర్ణంగా నిండిన రోజు ఇది..అందుకే ఆ రోజును గుర్తు చేసుకుంటూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో 26వ తేదీన జరిగే వేడుకలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన భవనానికి త్రివర్ణ రంగుల తో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన భవనం త్రివర్ణ రంగుల వెలుగుల్లో మెరుస్తోంది. దీనికితోడు భవనం ఎదుట ఉన్న జాతీయ పతాకం కనువిందు చేస్తోంది. కాగా కలెక్టరేట్‌ను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ముస్తాబు చేశారు. – రేణిగుంట/తిరుపతి అర్బన్
● ఉప్పొంగే శక్తి.. దేశభక్తి


