అంతులేని ఆనందం
అంతటా సంబరం
తిరుపతి రూరల్: అక్రమ మద్యం కేసులో 226 రోజులుగా రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రతి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, సంబరాలు చేసుకున్నారు. తమ ఆరాధ్య నాయకుడు చెవిరెడ్డి బెయిల్‌పై విడుదల కావడం సంతోషాన్ని తెచ్చిపెట్టిందని అంతటా సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం, గ్రామ శివార్లలో నేతలు సంబరాలతో హోరెత్తించారు. చెవిరెడ్డి అభిమానులు, పార్టీ నేతలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెవిరెడ్డి ప్లెక్సీకి పా లుతో అభిషేకించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తుమ్మలగుంటకు చెందిన యువత భారీగా బాణసంచా పేల్చగా మహిళలు ఆలయాల్లో పూజలు చేశారు.
అలిపిరిలో మొక్కుల చెల్లింపు
చెవిరెడ్డికి బెయిల్ రావడంతో చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు అలిపిరి పాదాల మండపం వద్దకు వెళ్లి శ్రీవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు పాదాల మండపంలోని స్వామి వారిని దర్శించుకుని చెవిరెడ్డి పేరిట అర్చన చేయించారు.
పులి లాంటి వ్యక్తి చెవిరెడ్డి
– భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీలో యాక్టీవ్‌గా ఉంటూ కూటమి నాయకుల గుండెల్లో దడ పుట్టించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా ఏడు నెలల పాటు జైల్లో నిర్బంధించారని, అయితే పులి బయట ఉన్నా, బోన్లో ఉన్నా పులి పులేనని, పులి లాంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని గురువారం మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి పే ర్కొన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ నేతల్లో భయం కలిగించాలన్న నీచపు ఆలోచనలతో చంద్రబాబు, పవన్‌కళ్యాన్, లోకేష్ లిక్కర్ స్కామ్ పేరుతో తప్పుడు కేసులు బనాయించి ఏడు నెలల పాటు జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు.అక్రమ కేసులకు, జైలు ని ర్బంధాలకు భయపడే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. రా ష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి అనేక మంది తమ పార్టీ నేతలకు అక్రమంగా జైళ్లకు పంపడమే నిదర్శనమన్నారు. అ యితే చంద్రబాబు అక్రమాలు, దుర్మార్గులు ఎంతో కాలం సాగవనడానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బెయిల్ రావడం, శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక ఇవ్వడం వంటి అంతా మంచి శుభాలే జరిగాయన్నారు.
అంతులేని ఆనందం


