తుమ్మలగుంటలో రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఏర్పాట్లు చేయించారు. స్వామివారు ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలపైన చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు. సూర్య జయంతి పర్వదినాన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఇప్పటికే ఆలయంతో పాటు పుష్కరణి పరిసరాలను శుభ్రం చేశారు. గర్భాలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచే వాహన సేవలు ప్రారంభం అవుతుండడంతో తగిన ఏర్పాట్లు చేశారు.
తుమ్మలగుంటలో రథసప్తమికి సర్వం సిద్ధం


