వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్:వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయా లని పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు సురేష్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశా రు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి జగనన్న విప్లవాత్మకంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. బాబు పాలనపై జనం విసిగిపోయారని, రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కో–ఆర్డినేటర్ వజ్రం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలను అధినేతన జగనన్న, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వెల్లడించారు. అందుకే ఏమాత్రం అలసత్వం వహించకుండా సమష్టిగా పనిచేసి ఫిబ్రవరి 15వ తేదీలోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీఎమ్మెల్యే గుంటివెంకటేశ్వరప్రసాద్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, పార్టీ ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట మండలాల అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, ముస్తాక్, పంజంవే ణుగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు లు రత్నమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మారెళ్ల రాజేశ్వరి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, యనమాల మహేష్, నందాబా ల, డీవీ రమణ, రత్తయ్య, సుబ్బరామరాజు, జనార్ధన్‌రాజు, హరికృష్ణారెడ్డి, బండారుమల్లి, ముజీబ్, సుదర్శన్‌రెడ్డి, ఘని ఆర్వీ రమణ, లక్ష్మీనారాయణ మ్మ, రాజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.


