హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ
తిరుపతి రూరల్:మండలలోని పెరుమాళ్లపల్లెలో ‘యంగ్ మెన్స్ రిక్రియేషన్ క్లబ్ వారు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ హోరా హోరీగా సాగింది. రెండు రోజులుగా నిర్వహించిన పోటీలకు ఏపీతోపాటు త మిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి 60 జట్లు పాల్గొన్నా యి. క్రీడాకారులు అందరికీ వసతి, భోజన సదుపా యాలను నిర్వాహకులు కల్పించారు. విజేతలకు 1.25 లక్షల నగదు బహుమతులు, ట్రోఫీలను అందించారు.
పట్టుకో.. పట్టుకో..
రిపబ్లిక్ డే రోజున సోమవారం కబడ్డీ టోర్నమెంట్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రెండు కోర్టుల్లో క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో తలపడ్డారు. పట్టుకో.. పట్టుకో.. అంటూ ప్రేక్షకులు క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
విజేతలు వీరే..
కబడ్డీ పోటీల్లో పాల్గొన్న 60 జట్లులో మొదటి స్థానంలో బెంగుళూరు రాయల్స్, రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన సేలం జట్టు, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సదుం జట్టు, నాలుగో స్థానంలో ఏపీకి చెందిన మహదేవజట్లు నిలిచాయి. విన్నర్స్‌కు రూ.50వేలు, రన్నర్స్‌కు రూ.35వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25వేలు, నాలుగోస్థానంలో నిలిచిన వారికి రూ.15వేలు అందించారు.
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ


