సూపర్ సిక్స్ పేరుతో మోసం
ఇదే మన నినాదం.. అధినేత అభిమతం వైఎస్సార్‌సీపీ అగ్ర నేతలు
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాఽథరెడ్డి ఆరోపించారు. పార్టీ బలోపేతానికి ఈ నెల 31వ తేదీలోపు గ్రామ, పట్టణస్థాయి కమిటీలను పూర్తి చేయాలని కోరారు.
సూళ్లూరుపేట:గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నేతలు ముందు వరుసలో కార్యకర్తలు వెనుక ఉండేవారని, రాబోయే జగనన్న 2.0లో శ్రేణులకే పెద్దపీట వేసేలా అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ ఉమ్మ డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరుపేట నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కాకాణి మాట్లాడుతూ ఇకపై జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలను భుజాల మీద మోస్తామని తెలిపారు. అలాగే శ్రేణులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అక్ర మ కేసులు, దౌర్జన్యా లు తప్ప పాలన సాగడం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాలు సేకరణ చేపడితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసిన చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
త్వరితగతిన కమిటీ
పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేస్తామని వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఒక్కో కమిటీలో 9 నుంచి 15 వరకు ఉంటారన్నారు. కష్టపడి చేసిన ప్రతి కార్యకర్త నేరుగా జగనన్నను కలిసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం నేతలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ, రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వెంకట నారాయణరెడ్డి, సనత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, కె.ఆర్ముగం, దువ్వూ రు రాహుల్‌రెడ్డి, పాదర్థి హరినాథ్‌రెడ్డి, ఒబ్బు వెంకటరత్నం, వట్టూరు కిషోర్‌యాదవ్, పట్టణ అధ్యక్షులు కృపాకర్‌రెడ్డి, కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కటకం దీపిక, నేతలు కామిరెడ్డి రాజా రెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, చిన్ని సత్యనారాయణ, అలవల సురేష్ పాల్గొన్నారు.
జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్దపీట
సూపర్ సిక్స్ పేరుతో మోసం


