పులికాట్‌లో పక్షుల లెక్కింపు
సూళ్లూరుపేట రూరల్ : పులికాట్ సరస్సుతోపాటు దొరవారిసత్రంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఆదివారం వాటర్ బర్డ్స్ సెన్సెస్ చేపట్టారు. డీఎఫ్‌ఓ హారిక మాట్లాడుతూ రెండు రోజులుగా పక్షుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముంబయికి చెందిన బీఎన్‌హెచ్ సొసైటీ, తిరుపతిలోని ఐఐఎస్ బృందం, క్రియా యూనివర్సిటీ విద్యార్థులు, వన్యప్రాణి విభాగం అధికారులు మొత్తం 8 బృందాలు లెక్కింపు చేపట్టినట్లు వివరించారు.
ఏఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి మెడల్
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపికాయ్యారు. మన రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపికై న ఏకై క వ్యక్తి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన రవిమనోహరాచారి 1991 మ్యాచ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలోకి అడుగుపెట్టారు. శిక్షణ అనంతరం 1992లో చిత్తూరు జిల్లా ఐరాలలో ఎస్‌ఐగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఎస్‌ఐగా పనిచేశారు. 2005లో సీఐగా పదోన్నతి పొంది చిత్తూరు ఈస్ట్, వెస్ట్, సర్కిళ్లు, సత్యవేడు, తిరుపతి టౌన్ సీఐగా పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుమల కై మ్ డీఎస్పీగా.. అనంతరం మదనపల్లి, కడప, నరసాపురం ప్రాంతాల్లో పనిచేశారు. తరువాత 2024 నుంచి తిరుపతి టౌన్ డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. తన సర్వీసుల్లో అనేక సంచలనమైన కేసులను చాకచక్యంగా దర్యాప్తు చేశారు. 2027లో ఆయన మెడల్ అందుకోనున్నారు.
పులికాట్‌లో పక్షుల లెక్కింపు


