సత్కారం.. రుణసాయం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
సగర్వంగా ఎగరిన జాతీయ పతాకం
తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో
పండుగ వాతావరణం
అలరించిన సాంస్కృతికం
ఆకట్టుకున్న శకటాలు.. స్టాళ్లు
ప్రత్యేక ఆకర్షణగా డాగ్ షో
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ
తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నీ హోరాహోరీగా సాగింది.
సోలార్ వెలుగుల్లో గ్రామీణం
గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు.
ఉత్తమ సేవలకు పురస్కారం
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్,
ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో పండుగ వాతావరణం ఆవిష్కృతమైంది. ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సంబరం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ఇనుమడింపజేసింది. ఈ క్రమంలోనే కలెక్టర్ చేతులమీదుగా జాతీయ జెండా సగర్వంగా ఎగిరింది. త్రివర్ణ పతాకం సమున్నతంగా రెపరెపలాడింది. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రతిభ కనువిందు చేసింది. ప్రగతి శకటాల పరుగు కట్టిపడేసింది. వినూత్నంగా చేపట్టిన డాగ్ షో అబ్బురపరిచింది. విభాగాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలోని సామగ్రి ప్రత్యేకతను చాటుకుంది. అలాగే ఉద్యోగుల విశిష్ట సేవలకు అవార్డులతో గుర్తింపు లభించింది.
జాతీయ జెండా ఆవిష్కరించి వందనం సమర్పిస్తున్న
కలెక్టర్ వెంకటేశ్వర్, పక్కన ఎస్పీ సుబ్బరాయుడు
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల:తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు చేరుకుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,131 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
జాతీయ విద్యా సదస్సుకు సురేష్
కేవీబీపురం: కేవీబీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూనాటి సురేష్‌కు కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న జాతీ విద్యా సదస్సుకు ఆహ్వానం అందింది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు చేపట్టనున్నారు. పరీక్షలు సంస్కరణలు అనే అంశంపై ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌టీ క్యాంపస్‌లో మంగళవారం నుంచి జరగనున్న సదస్సులో సురేష్ మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులు, విద్యాశాఖ అధికారులు, దేశంలోని అన్ని రాష్ట్రాల నిపుణులు ఇందులో పాల్గొననున్నారు.
ఎకై ్సజ్ సీఐకి సేవా పతకం
నారాయణవనం: విజయవాడలో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలేఓ్ల పుత్తూరు ఎకై ్సజ్ సీఐ మురళీమోహన్‌కు ఉత్తమ సేవా పతకం లభించింది. ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు.
తిరుపతి అర్బన్/ తిరుపతి క్రైమ్ : తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం మైదానంలో ఆయన ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి ఓపెన్ టాప్ వాహనంలో ముందుకు సాగుతూ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. అలాగే వివిధ శాఖలకు చెందిన ప్రగతి శకటాలు, పలు విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఆర్‌ఓ నరసింహులు, ఆర్‌డీఓ రామ్మోహన్ సందర్శించారు.
అలరించిన విద్యార్థులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీరిలో ఉత్తమ ప్రతిభను కనబరచి మొదటి బహుమతిని తిరుపతిలోని శ్రీచైతన్య పాఠశాల పిల్లలు, రెండో బహుమతిని ఏర్పేడులోని ఎస్‌వోఎస్ చిల్ర్ట్‌న్స్ స్కూల్, మూడో బహుమతి చంద్రగిరిలోని అక్షరధామ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు దక్కించుకున్నారు. పోటీపడిన మిగిలిన పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్ చేతులమీదుగా అందించారు. ఈ క్రమంలోనే పోలీస్ జాగిలాలతో ప్రదర్శించిన డాగ్ షో విశేషంగా ఆకట్టుకుంది.
తొమ్మిది ప్రగతి శకటాలు
గణతంత్ర వేడుకల్లో అధికారులు పోటీలు పడి 9 ప్రగతి శకటాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో మొదటి బహుమతి విద్యుత్‌శాఖకు, రెండో బహుమతి వ్యవసాయ, ఉద్యానశాఖ, మూడో బహుమతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు దక్కింది.
మద్దిలేటి,
ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్
హారిక,డీఎఫ్‌ఓ, సూళ్లూరుపేట
బాపిరెడ్డి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం
చంద్రశేఖర్,ఎస్‌ఈ, ఎస్పీడీసీఎల్
శ్రీరామ్‌కుమార్, జిల్లా రిజిస్ట్రార్
బాలాజీ నాయక్, మైనింగ్ ఏడీ
బాలాజీ నాయక్
ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ
సురేష్‌బాబు, తిరుపతి తహసీల్దార్
రోజ్‌మాండ్, ఎస్‌డీసీ
దేవేంద్రరెడ్డి,
ఎస్‌డీసీ
తిరుపతి అర్బన్/తిరుపతి క్రైమ్ : పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన వివిధశాఖల ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ మేరకు అవార్డులను అందించారు. ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, డీఆర్‌ఓ నరసింహులతోపాటు అవార్డు గ్రహీతల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా గణతంత్ర దినోత్సవం
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడైన రాజంపేట తాలూకా ఉర్లగట్టుపాడుకు చెందిన రామలింగరాజు వారసుడైన ఆయన కుమారుడు రాధాకృష్ణమరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి పథకాలకు చెందిన లబ్దిదారులకు రూ.410.60 కోట్ల మెగా చెక్కును అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రామచంద్రుడు, తిరుపతి, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
11 స్టాళ్లు
విభాగాల వారీగా 11 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో మొదటి బహుమతిని పశుసంవర్థక శాఖ, రెండో బహుమతి మత్స్య శాఖ, మూడో బహుమతి ఐసీడీఎస్ శాఖలకు లభించాయి. అలాగే వివిధ విభాగాలకు చెందిన 246 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ సేవల నేపథ్యంలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం
సత్కారం.. రుణసాయం


