బ్రహ్మాండ తేజం
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
● శోభాయమానంగా ప్రకాశించిన తిరుగిరులు ● శ్రీమలయప్పస్వామికి విశేష వాహన సేవలు ● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడు
బలోపేతమే లక్ష్యంగా కమిటీలు
సూళ్లూరుపేట రూరల్ : వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతమే లక్ష్యంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరపేట నియోజకవర్గస్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తండిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు భీరేంద్రవర్మ, ఎన్‌డీసీసీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. కాకాణి మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, అనుబంధ సంస్థలకు కమిటీలు వేస్తున్నామన్నారు. 18లక్షల మందిని జగనన్న సైనికులుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. 19 నెలల చంద్రబాబు పాలనపై ప్రజలకు విసిగిపోయారని, వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరిగిందని వివరించారు. సర్కారు అరాచకాలు, దౌర్జన్యాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొంటున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలే తిరగబడ్డారని తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసాలను జనం గుర్తించారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నేతలను పార్టీ శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు వేళ్లపాలెం కృపాకర్‌రెడ్డి , తడ మండలం అధ్యక్షుడు కెలివి ఆర్ముగం, పెళ్లకూరు మండలం అధ్యక్షుడు వెంకటరత్నం, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు ఓట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండలం అధ్యక్షుడు పాదర్తి హరనాథరెడ్డి, కలికి మాధవరెడ్డి, నేతలు జెట్టి వేణు, అలవల సురేష్ పాల్గొన్నారు.
25ఎస్‌ఎల్‌పి141 నేతలను గజమాలతో సత్కరిస్తున్న నేతలు
25ఎస్‌ఎల్‌పి 142 హాజరైన నేతలు, కార్యకర్తలు
పవిత్ర రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి సేవకు ముక్కోటి దేవగణం ఆదివారం తిరుమలకు తరలివచ్చిందా అన్నట్టు తిరుగిరుల తేజం ఇనుమడించింది.. తిరుమలేశుని వైభవం త్రిలోకాలను మైమరపించింది.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి సకల ప్రాణకోటిని పరవశింపజేసింది.. వివిధ వాహనాలపై విశేషాలంకరణలో దర్శనమిచ్చిన వేంకటాచలపతిని వీక్షించి అశేష భక్తజనం తన్మయత్వం చెందింది.. తొలుత సూర్యప్రభల కాంతులీనుతూ సాక్షాత్కరించిన మలయప్పస్వామి దివ్యతేజస్సుకు పులకరించింది.. చిన్నశేషునిపై చిద్విలాసంగా ఆశీనులైన శ్రీనివాసునికి కై మోడ్పులర్పించింది.. అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని అధిరోహించిన శ్రీమన్నారాయణుని సేవించుకుని చరితార్థమైంది.. పుణ్య పుష్కరిణిలో చేపట్టిన చక్రస్నాన ఘట్టంలో పాలుపంచుకుని పునీతమైంది.. కల్పవృక్ష నీడలో కొలువుదీరిన సర్వాంతర్యామి అనుగ్రహంతో సకల అభీష్టాలను సిద్ధించుకుంది.. గోపాలా.. సర్వభూపాలుడి నువ్వేనంటూ వేనోళ్ల కొనియాడింది.. చంద్రప్రభ శోభితంగా ఊరేగుతున్న ఏడుకొండలస్వామికి మొక్కులు సమర్పించుకుని తరించింది. – తిరుమల
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం
బ్రహ్మాండ తేజం


