తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ 22వ స్నా తకోత్సవం శనివారం వర్సిటీలో నిర్వహించనున్న ట్లు వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. శుక్రవారం ఆమె సావేరి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీ ర్ చాన్సలర్ హోదాలో హాజరవుతున్నారని చెప్పా రు. వర్సిటీలో యూజీ, పీజీ డిగ్రీల కాన్వొకేషన్‌కు 1,601 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో పీహెచ్‌డీ డిగ్రీలు సైన్స్ విభాగంలో 66, సోషల్‌సైన్స్ విభాగంలో 55 మందికి పట్టా లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పీజీలో సైన్స్ విభాగం నుంచి 638 మందికి, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో 16 మందికి, సోషియల్ సైన్స్ విభాగం నుంచి 286 మంది పట్టాలు పొందనున్నారన్నారు. యూజీ లో 286 మందికి సైన్స్ విభాగంలో, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 576 మందికి, సోషియల్ సైన్సెస్‌లో 342 మందికి డిగ్రీ పట్టాలు ఇవ్వనున్నట్లు తెలి పారు. ప్రతిభ చూపిన విద్యారులు 102 మందికి గోల్డ్‌మెడళ్లు, 23మందికి బుక్‌ప్రైజ్‌లు, ఏడుగురికి క్యాష్ అవార్డులు ఇస్తామన్నారు. హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త శశికళ సిన్హాకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ ఉషా, ప్రొఫెసర్ అనురాధ, అధ్యాపకులు పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ రెహానా బేగం శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయం వద ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్థంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


