రేణిగుంట: జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మహిళా వర్సిటీ వీసీ వి.ఉమ, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి భరత్ పుష్పగుచ్ఛాలతో గవర్నర్‌కి సాదరంగా స్వాగతం పలికారు.
ఇంటర్ పరీక్షకు 251మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాల్లో జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ పేపర్–2 పరీక్షకు 251 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 8,798 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 8,547 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని 14 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఒకేషనల్ పరీక్షలకు 1,082 మందికి గాను 1,050 మంది హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంత వాతావరణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. శనివారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎకనామిక్స్ పేపర్–1 పరీక్ష జరగనున్నట్లు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 59,194 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,295 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కా నుకల రూపంలో హుండీలో రూ.3.87 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడాని కి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


