త్రిశంకు స్వర్గంలో జగనన్న కాలనీలు నిర్మాణాల గురించిపట్టించుకోని సర్కార్ హౌసింగ్ శాఖని వేధిస్తున్న అధికారుల కొరత పీడీనే ఈఈగా విధులు నిర్వహిస్తున్న వైనం ప్రతి డీఈకి రెండు, మూడు నియోజక వర్గాల బాధ్యతలు హౌసింగ్ శాఖ అధికారులనుశాసిస్తున్న కాంట్రాక్టర్లు
అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలపై కక్ష సాధింపు ధోరణితో వ్య వహరిస్తోంది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలన్న ఆలోచించడం లేదు. నిర్మాణాలను పూర్తి చేయలేదని అనేక మంది లబ్ధిదారులకు సొంతింటి కలను దూరం చేసే ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా ముందుకు సాగని జగనన్న కాలనీల్లోని అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలే నిదర్శనం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఉచితంగా పక్కా గృహం నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూములను కొనుగోలు చేసి మహిళల పేరుతో పట్టాలు పంపిణీ చేసింది. ఆ స్థలాల్లో పక్కా గృహాల నిర్మాణాలను చేపట్టింది. తిరుపతి జిల్లాలో 571 లే అవుట్లను ఏర్పాటు చేసి, 61,799 పక్కాగృహాలు మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలో 609 లే అవుట్లలో 77,366 పక్కాగృహాలను మంజూరు చేసింది. అందులో 40 నుంచి 50 శాతానికి పైగా పక్కాగృహాలు పూర్తి చేసి, గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. మరో 30 శాతం రూఫ్ లెవల్‌లో ఉంటే.. 20 శాతానికి పైగా పునాదులు వేశారు. మరో 10 శాతం మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు.
గృహానికి గ్రహణం!
అధికారుల కొరతే నిదర్శనం
కూటమి ప్రభుత్వంలో హౌసింగ్ శాఖలో అధికారుల కొ రత తీవ్రంగా ఉంది. పీడీగా ఉన్న అధికారే గూడూరు, శ్రీ కాళహస్తికి ఈఈగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం పీ డీగా ఉన్న అధికారి ఈఈగా ఉండకూడదు. కూ టమి ప్రభుత్వంలో మూడు పోస్టులు ఒక్కరే ని ర్వహిస్తున్నారు. ప్రతి నియోజక వర్గానికి ఒక్కో ఈఈ ఉండాలి. అయితే తిరుపతి, చంద్రగిరి, రైల్వేకోడూరు నియోజక వర్గాలకు ఈఈ ఒక్కరే ఉన్నా రు. అలాగే ఒక్కో నియోజక వర్గానికి ఇ ద్దరు డీఈలు ఉండాలి. కానీ ప్రస్తుతం రెండు, మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక్కరే డీఈ గా విధులు నిర్వహిస్తున్నారు. హౌసింగ్‌శాఖ అస్తవ్యస్తంగా మారటానికి కాంట్రాక్టర్లే కారణం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో హౌసింగ్‌శాఖ నడుస్తుందనే విమర్శలున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
జగనన్న
కాలనీలకు
చంద్ర
గ్రహణం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కాలనీల్లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ నిలిపివేసినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అధి కారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయడంతో ఆ నిధులన్నీ వృథా అయ్యాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలో పక్కాగృహాల నిర్మాణాలు ఆగిపోవడానికి అనేక కారణాలున్నాయని ఆశాఖలో పనిచేసే సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జగనన్న కాలనీల్లో కూటమి శ్రేణులు అధికారులతో కుమ్ముకై ్క అవినీతి అక్రమాలు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పక్కాగృహాల నిర్మాణాల్లో రకరకాల అనేక మోసాలకు పాల్పడుతున్నారు.
బిల్లులు చెల్లించాలన్నా పర్సెంటేజ్ ఇచ్చుకోవాలి. పక్కాగృహం నిర్మించుకోవాలన్నా మామూళ్లు ఇచ్చుకోవాలి. ఇలా లబ్ధిదారులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేసినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.


