సంగం: మండలంలోని సంగంలో చికెన్ వ్యర్థాల వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వ్యర్థాలతో ఉన్న ఆరు డ్రమ్ము లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సమీపంలో గుంత తీసి వ్యర్థాలను పూడ్చి పెట్టారు.
జామాయిల్
కర్ర తరలిస్తుండగా..
● నాలుగు ట్రాక్టర్ల స్వాధీనం
చేజర్ల: మండలంలోని ఏటూరు అటవీ ప్రాంతంలో ఉన్న జామాయిల్ ప్లాంటేషన్ నుంచి అక్రమంగా కలప తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం ఫారెస్ట్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ఏటూరు గ్రామానికి చెందిన ప్రైవేట్ వ్యక్తులు అనుమతి లేకుండా జామాయిల్ కర్రను నరికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది డ్రైవర్లను అదుపులోనికి తీసుకున్నారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఆదూరుపల్లి చెక్‌పోస్ట్‌లో ఉంచినట్లు దాచూరు డీఆర్వో రసూల్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటికి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పారా
కబడ్డీ పోటీలకు ఎంపిక
చిల్లకూరు: జాతీయ స్థాయి లో తొలిసారిగా ఏర్పాటు చేసిన పారా (దివ్యాంగు లు) కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. నెల్లూరుకు చెందిన రాజేష్ ఒకరు కాగా మరొక రు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా క్రీడా పోటీల్లో పాల్గొని విజే తగా నిలిచిన గూడూరు పట్టణం చర్చి కాంపౌండ్‌కు చెందిన కేఏ పురుషోత్తం (అన్వే ష్). వీరు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మీరట్‌లో జరిగే పారా జాతీయ స్థాయి ఫెడరేషన్ కప్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.
9న మహిళా సమస్యల
పరిష్కార వేదిక
నెల్లూరురూరల్: ఈనెల 9వ తేదీన మహిళా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరులోని జెడ్పీ మీటింగ్ హాల్లో సోమవారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని మహిళల ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. గృహ హింస, వేధింపులకు గురైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోజు న అందిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.


