నెల్లూరు(టౌన్): నూతన నిస్సాన్ గ్రావైట్ కారును మార్కెట్లోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌ఎం మురళీనాయక్ విడుదల చేశారు. నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని హైటెక్ మోటార్స్ నిస్సాన్ షోరూంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ కారు సెవన్ సీటర్స్‌తో అధునాతన ఫీచర్స్‌తో విడుదల చేశారన్నారు. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ పా ర్కింగ్ సెన్సార్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో వైపర్, ఫాలో హెడ్‌ల్యాంప్స్‌తో ఉందన్నారు. 3–రో ఏసీ, వైర్లెస్ చార్జర్, డ్యూయల్ డాష్ క్యామ్, ఎల్‌ఈడీ తదితర ఫీచ ర్స్ ఉన్నాయన్నారు. ప్రారంభ ధర రూ.5.65 లక్షలన్నారు. ఐదు రంగుల్లో లభ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో షోరూమ్ డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమ రెడ్డి, ఆశిష్‌రెడ్డి, జనరల్ మేనేజర్ ఎన్‌వీఎస్ శాస్త్రి, బ్రాంచ్ మేనేజర్ గోపీ, సిబ్బంది పాల్గొన్నారు.


