సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. బొమ్మనహాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘటన జరిగింది. ఈనెల 5వ తేదీన బొమ్మనహాల్ ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుండగా.. బలం లేకపోయినా ఎంపీపీ పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీసింది.
బీఫాం, అనెక్జర్ పత్రాలు అందజేసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధుల సెల్ ఫోన్లను టీడీపీ నేతలు లాక్కున్నారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వహించారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్‌లో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని మెట్టు గోవిందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


