సాక్షి, తాడేపల్లి: రేపు(జనవరి 22, గురువారం) వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సహా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత తదితర అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవాళ(జవనరి 21, బుధవారం) ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు.


